ఆయన ఫాలోవ‌ర్‌ ని అయిపోయా.....

SMTV Desk 2019-05-30 18:34:57  priyadarshi

యాక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శి .. జూన్ 21న చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్‌లో టైటిల్ పాత్రధారి మ‌ల్లేశం గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ విడుదలైంది. ఈ సంద‌ర్భంగా ప్రియ‌ద‌ర్శి మాట్లాడుతూ..."ద‌ర్శ‌క నిర్మాత రాజ్, నేను మ‌ల్లేశంగా న‌టించాల‌ని చెప్పిన‌ప్పుడు నేను న‌మ్మ‌లేదు. ఓ క‌మెడియ‌న్ ట్యాగ్‌తో ఉన్న నేను మ‌ల్లేశంగారి పాత్ర చేయ‌డం చాలా గొప్ప‌గా అనిపించింది. ఆ ఫీలింగ్‌ను మాట‌ల్లో చెప్ప‌లేకుండా ఉన్నాను. మ‌ల్లేశం సినిమాలో అస‌లు హీరో చింత‌కింది మ‌ల్లేశంగారే. ఆయ‌న క‌థ‌ను ఆయ‌నే రాసుకున్నారు. ఆయ‌న ఫాలోవ‌ర్‌గా ఆయ‌న చేయి ప‌ట్టుకుని నేను న‌డించానంతే" అన్నారు.