నంద్యాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..

SMTV Desk 2017-08-28 12:54:09  nandhyla elections, ysrcp, tdp, telugudesham party, ys jaganmohanreddy, n. chandrababunaidu, bhuma brmhanandareddy, shilpa mohanreddy, nandhyala bi elections results

నంద్యాల ఆగస్ట్ 28: నేడు నంద్యాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి జోరు కొనసాగిస్తున్నారు. నంద్యాల రూరల్, అర్బన్ లలో టిడిపిదే హవా కనిపిస్తుంది. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి, తొలి రౌండ్ లోనే 1300 ఓట్ల మెజారిటితో, రెండో రౌండ్ ముగిసేసరికి 2,958 ఓట్లతో సమీప వైసీపి ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా మూడో రౌండ్లోనూ 3,113 ఓట్లతో, ఈ రౌండ్ ముగిసేసరికి 6,071 ఓట్లతో ఆధిక్యంతో, వరుసగా నాలుగవ రౌండ్లో 9,670 ఓట్లతో, ఐదో రౌండ్లో 12 వేల ఓట్లు దాటి, ఆరో రౌండ్లో 3,302 ఓట్లు, ఏడవ రౌండ్ ముగిసేసరికి 17,206 ఓట్లతో, ఎనిమిది రౌండ్ తర్వాత 340 ఓట్ల ఆధిక్యంతో, తొమ్మిదవ రౌండ్లో 879 ఓట్ల ఆధిక్యంతో, వరుసగా తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 18,220 ఓట్లతో టిడిపి గెలుపు దిశగా కొనసాగుతుంది.