సూపర్ స్టార్ సినిమా కోసం సర్వం సిద్ధం

SMTV Desk 2019-05-30 18:32:58  mahesh

మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. రేపు ఉదయం హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆ తరువాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మికను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కీలకమైన పాత్రల్లో విజయశాంతి - రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక మహర్షి సినిమాకి దేవిశ్రీ అందించిన ఆడియోకి తక్కువ మార్కులు పడిన నేపథ్యంలో, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఆయననే తీసుకుంటారా? తమన్ కి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.