మంత్రి వర్గంలో చేరినా అధ్యక్ష పదవి మాత్రం అమిత్‌షాదే

SMTV Desk 2019-05-30 18:13:50  pm modi

కేంద్రంలో భాతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీ సాధించేందుకు కారణమైన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ద్వయాన్ని విడదీసే అవకాశాలు లేవని బీజేపీ వర్గాల్లో సమాచారం. కొత్త మంత్రివర్గంలో ఒక వేళ అమిత్‌షా చేరినప్పటికీ బీజేపీ చీఫ్‌గా ఆయననే కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అమిత్‌ షాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్న చర్చ సాగుతున్న నేపధ్యంలో తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది.

ముఖ్యంగా రానున్న రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అవి పూర్తయ్యే వరకు అమిత్‌ షా చేతుల్లోనే పగ్గాలు ఉండడం మంచిదన్న అభిప్రాయం పార్టీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ అంశంపై తర్జన భర్జన జరుగుతున్నప్పటికీ ఒకటి రెండురోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.