ప్రపంచకప్: తొలి పోరుకు ఇరు జట్లు సిద్దం

SMTV Desk 2019-05-30 18:06:44  icc world cup 2019, England vs south Africa

లండన్: ప్రపంచకప్ మెగా టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రిక జట్ల మధ్య జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్‌తో 12వ ప్రపంచకప్‌కు తెరలేస్తోంది. ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంత అభిమానుల మద్దతుతో ఇంగ్లండ్ మరింత మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. ఓపెనర్లు జానీ బైర్‌స్టో, జాసన్ రాయ్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. వార్మప్ మ్యాచుల్లో ఇద్దరూ సత్తా చాటారు.ఇక, డుప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సఫారీ జట్టు సమతూకంగా ఉంది. డుప్లెసిస్, ఐడెన్ మార్‌క్రామ్, డికాక్, హాషిం ఆమ్లా, డేవిడ్ మిల్లర్, డుమిని తదితరులతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. రబడా, ఎంగిడి, తాహిర్, షంసి, స్టెయిన్, మోరిస్‌లతో బౌలింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. దీంతో సౌతాఫ్రికా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది.