వరల్డ్ కప్: గూగుల్ స్పెషల్ డూడుల్

SMTV Desk 2019-05-30 15:55:26  icc world cup 2019 google special doodle

నేడు మెగా టోర్నీ ప్రపంచకప్ ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానుంది. నెలన్నరపాటు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీపడుతుండగా.. 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే వరల్డ్‌కప్‌ని పురస్కరించుకుని గూగుల్ ఈరోజు ప్రత్యేక డూడుల్‌ని రూపొందించింది. Googleలోని రెండో Oని బంతి ఆకారంలో రూపొందించిన గూగుల్.. Lని స్టంప్స్‌గా మార్చింది. రెండు సెకన్లు వెయిట్ చేస్తే.. ఈ డూడుల్‌లోనే ఓ యానిమేషన్‌ కూడా ప్లే అవుతోంది. బంతి ఆకారం నుంచి బౌలర్ బంతి విసరగా.. స్టంప్స్‌ వద్ద బ్యాట్స్‌మెన్ బంతిని హిట్ చేస్తాడు. ఆఖరిగా ఫీల్డర్ బంతిని క్యాచ్‌గా అందుకోవడంతో ఈ యానిమేషన్ ముగుస్తోంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తొలి మ్యాచ్‌‌లో ఢీకొనబోతున్నాయి. భారత్ జట్టు జూన్ 5న తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా టీమ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.