జగన్ ప్రమాణస్వీకారం.. పూలవర్షం కురిపించేందుకు సిద్ధమైన హెలికాప్టర్!

SMTV Desk 2019-05-30 15:31:42  jagan

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరపురాని వేడుకగా మలిచేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇందుకోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.