నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధం

SMTV Desk 2019-05-30 15:28:26  Naredra Modi, oath taking ceremony

భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గురువారం రాత్రి 7 గంటలకు కొత్త మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంచుమించు 8వేల మంది అతిథుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌, కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌, బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యు విన్‌ మైంట్‌, భూటాన్‌ ప్రధాని లోటయ్‌ సెరింగ్‌, థాయ్‌లాండ్‌ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్‌లు హాజరుకానున్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.