హాలీవుడ్‌లోకి.......మరో బాలీవుడ్ నటి

SMTV Desk 2019-05-30 15:27:20  huma khureshi

ముఖ బాలీవుడ్ న‌టి హ్యుమా ఖురేషి ద‌క్షిణాదిన నటించిన చిత్రం కాలా . సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో న‌టించారు. ఇప్పుడు ఈమె హాలీవుడ్‌లోన‌టించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. హాలీవుడ్ డైరెక్ట‌ర్ జాక్ స్నిడ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ ఆఫ్ ది డెత్‌ అనే జాంబిక్ థ్రిల్ల‌ర్ రూపొంద‌నుంది. జూలై నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హ్యుమాఖురేషి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 300, మ్యాన్ ఆఫ్ స్టీల్‌, బ్యాట్ మాన్ వెర్స‌స్ సూప‌ర్‌మేన్ వంటి భారీ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ఈమె లైలా అనే టీవీ సీరియ‌ల్‌లో న‌టిస్తున్నారు. మ‌రి ప్రియాంక చోప్రాలాగానే హ్యుమా ఖురేషి కూడా హాలీవుడ్‌లోనే పాగా వేస్తుందేమో చూడాలి.