రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగశౌర్య

SMTV Desk 2019-05-30 15:25:19  naga shourya

రాఘవేంద్రరావు ఒక విభిన్నమైన చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ముగ్గురు దర్శకులు పనిచేయనున్నారనీ, ముగ్గురు కథానాయికలు .. ఒక హీరో ఉంటారని చెప్పారు. ఇప్పటికే ఒక దర్శకుడిగా క్రిష్ ను .. హీరోగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారట.

ముగ్గురి దర్శకులపై రాఘవేంద్రరావు పర్యవేక్షణ ఉంటుంది. నాయికా ప్రాధాన్యత కలిగిన కథగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ముగ్గురు నాయికల జీవితాలు వేరు వేరు కథలుగా కొనసాగుతుంటాయి. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు చిత్రీకరించనున్నాడు. ఈ మూడు కథల్లోను నాయకుడిగా నాగశౌర్య కనిపించనున్నాడు. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.