ప్లీజ్..... ఎలాంటి పుకార్లను నమ్మొద్దు: 'సాహో' దర్శకుడు

SMTV Desk 2019-05-30 14:10:48  sahoo

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో సాహో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకులుగా పనిచేస్తోన్న శంకర్ ఎహసాన్ లాయ్, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అందుకు పలు కారణాలు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా సుజిత్ స్పందిస్తూ, "ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తాము .. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విడుదల విషయంలో వస్తోన్న ఎలాంటి పుకార్లను నమ్మవద్దు" అని చెప్పుకొచ్చాడు.