నేడే వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం.. హాజరు కానున్న కెసిఆర్

SMTV Desk 2019-05-30 13:46:07  Jagan, Kcr,

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం జరుగనున్న ఎపి సిఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 10.55 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఉదయం 11.25 గంటలకు రోడ్డుమార్గంలో విజయవాడ ఎంజి రోడ్డులోని గేట్ వే హోటల్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 12.08 గంటలకు వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు మళ్లీ గేట్ వే హోటల్‌కు చేరుకుని భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30కి గేట్ వే హోటల్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ పయనమవుతారు. అక్కడ మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా, సిఎం కెసిఆర్‌తో పాటు వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్ కూడా ఒకే విమానంలో ఢిల్లీ వెళతారని తెలుస్తోంది.