కాజోల్‌ తల్లికి అస్వస్థత

SMTV Desk 2019-05-30 13:45:23  kajol,

బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ తల్లి, సీనియర్‌ నటి తనూజా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.

అయితే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. కాగా రెండు రోజుల క్రితమే కాజోల్ మామ, అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.