రాజ్ దూత్ మూవీ తో అలరించబోతున్న శ్రీహరి వారసుడు

SMTV Desk 2019-05-30 13:42:26  Rajdooth, srihari,

తెలుగు పరిశ్రమలో హీరో, విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని పాత్రల్లో నటించి మెప్పి ఎంతోమంది ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన శ్రీహరి 2013 అక్టోబర్ 9న మరణించిన విషయం తెలిసిందే. పరిశ్రమ అంతా షాక్ అయ్యేలా చేసింది శ్రీహరి మరణం. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో తప్ప డిస్కో శాంతి, శ్రీహరి పిల్లల పెద్దగా ప్రస్థావ రాలేదు. తండ్రి తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించెందుకు రెడీ అయ్యాడు శ్రీహరి తనయుడు మేఘాంశ్. శ్రీహరి పెద్ద కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

దర్శకద్వయం కారిక్ అర్జున్ కలిసి డైరెక్ట్ చేస్తున్న సినిమా రాజ్ దూత్ లో మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్నాడు. ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ అయ్యింది. సినిమా టైటిల్ కు తగినట్టుగానే రాజ్ దూత్ బైక్.. హీరో బ్యాక్ కనిపించింది. చూస్తుంటే కుర్రాడు మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకోవడం గ్యారెంటీ అనేలా ఉంది. ఫస్ట్ లుక్ వస్తేనే కాని మేఘాంశ్ శ్రీహరి ఎలా ఉంటాడో తెలుస్తుంది. శ్రీహరి మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు తనయుడు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని చెప్పొచ్చు.