రాజ్యసభకు అమిత్ షా రాజీనామా

SMTV Desk 2019-05-30 13:39:17  Amit Shah ,

రాజ్యసభ సభ్యుడైన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నిన్న తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైనందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదేవిధంగా కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అమిత్‌ షా గాంధీ నగర్‌ నుంచి, రవి శంకర్‌ ప్రసాద్‌ పాట్నా నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా ఇంకా వీరితో పాటు మంత్రి స్మృతి ఇరానీ, రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, డీఎంకే నేత కనిమొళి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది.