మగ్గం వీరుడి కథ.. ఆసక్తిరేపుతున్న మళ్లేశం ట్రైలర్..!

SMTV Desk 2019-05-30 13:34:28  Mallesham Trailer, Priya Darshin,

పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. లేటెస్ట్ గా అతను లీడ్ రోల్ లో వస్తున్న సినిమా మళ్లేశం. మగ్గం వీరుడు చింతకింది మల్లేశం జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజ్ ఆర్ డైరెక్ట్ చేస్తున్నారు. మల్లేశ్ బాల్యం నుండి మొత్తం కథను కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపిస్తున్నారని తెలుస్తుంది.6వ తరగతిలోనే చదువు ఆపేసిన మళ్లేశం ఇంజినీర్ ఎలా అయ్యాడు. మగ్గం పట్టిన చేతులతో ఎలా పద్మశ్రీ గెలుచుకున్నాడో సినిమాలో చూపించబోతున్నారు. సినిమా ట్రైలర్ చూస్తే ప్రియదర్శి నటన ప్రధాన బలంగా నిలిచేలా ఉంది. కమెడియన్ గా చేస్తూ సడెన్ గా మళ్లేశం పాత్రతో అందరిని సర్ ప్రైజ్ చేశాడు ప్రియదర్శి. నల్గొండ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కథ మొత్తం తెలంగాణా యాసలోనే నడుస్తుంది. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.