యాత్ర-2లో ప్రముఖ హీరో .?

SMTV Desk 2019-05-30 13:30:52  Surya, Yathra 2,

వైఎస్సార్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా యాత్ర. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఏపిలో వైఎస్ జగన్ గెలిచిన సందర్భంగా యాత్ర దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 ఎనౌన్స్ చేశాడు. తాను చెప్పాలనుకున్న కథ మీరు రాశారంటూ ట్వీట్ చేశాడు. ఇక అనుకున్నట్టుగానే వైఎస్సార్ జీవిత కథలో వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎలా అంటున్నాడు.

అది చెప్పేందుకే యాత్ర-2 తీస్తున్నా అంటున్నాడు. వైఎస్ యాత్ర రాజా రెడ్డి సమాధి దగ్గర నుండి మొదలవగా.. యాత్ర-2 వైఎస్సార్ సమాధి నుండి మొదలవుతుందని ట్వీట్ చేశారు మహి వి రాఘవ్. ఇక ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తాడని తెలుస్తుంది. వైఎస్ జగన్ ఫ్యామిలీతో సత్సంబంధాలున్న సూర్య ఎన్.జి.కే ఈవెంట్ లో జగన్ ను జగనన్నా అనడం విశేషం.

యాత్ర-2లో నటించడానికి తనకేం అభ్యంతరం లేదని.. కాకపోతే ఆ సినిమాకు సంబందించి తనని ఎవరు కలవలేదని అన్నాడు సూర్య. ఒకవేళ సూర్య మిస్సైతే వైఎస్ జగన్ గా దుల్కర్ సల్మాన్ నటిస్తాడని తెలుస్తుంది. వైఎస్సార్ యాత్రలో వైఎస్ గా మమ్ముట్టి నటించి మెప్పించిన విషయం తెలిసిందే.