బాలయ్య నెక్స్ట్ మూవీ అప్ డేట్

SMTV Desk 2019-05-30 13:27:33  balayya, Balakrishna,

ఎన్నికల సమరం ముగిసింది కాబట్టి ఇక సినిమా వాళ్లు తమ తర్వాత ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తో చేదు అనుభవాన్ని మూటకట్టుకున్న నందమూరి బాలకృష్ణ తన 104వ సినిమా జై సింహా కాంబినేషన్ లో చేస్తాడని వార్తలు వచ్చాయి. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో జగపతి బాబు విలన్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నారు. సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో విలన్ జగపతి బాబు తాత, తండ్రి పాత్రల్లో నటిస్తాడట.

ప్రస్తుతం ఏపిలో పాల సాగిస్తున్న వైసిపికి వ్యతిరేకంగా తాత, తండ్రి మీద పగ తీర్చుకునే సినిమాగా బాలయ్య సినిమా ఉంటుందని.. అది ఎలా లేదన్నా వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ జగన్ లను ఉద్దేశించి తీసినట్టు అవుతుందని ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్నారట. అధికారంలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కాని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇలాంటి రిస్క్ వద్దని అనుకున్నాడట బాలకృష్ణ. అందుకే ఆ సినిమా కథను మార్చమని చెప్పాడట.

ఇక బోయపాటి శ్రీనుతో సినిమా కూడా సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. జై సింహా కాంబో సినిమా లేట్ అయినా బోయపాటి సినిమా వస్తున్నందుకు నందమూరి ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.