12 ఏళ్ల బాలిక సంచలన నిర్ణయం

SMTV Desk 2019-05-30 13:22:19  khushi

ఆరో తరగతిలో 97 శాతం మార్కులతో తన ప్రతిభ చాటుకున్న ఓ 12 ఏళ్ల బాలిక జైనమత దీక్ష తీసుకుని సన్యాసినిగా మారిపోయిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2018 నవంబర్‌లో పాఠశాలకు వెళ్లడం మానేసిన ఖుషీ షా.. సాధువులు గడిపే సాధారణ జీవనాన్ని చాలా దగ్గర నుంచి గమనించారు.

దీంతో జైనమత ఆచార, వ్యవహారలపట్ల ఆకర్షితురాలైన బాలిక.. బుధవారం జైన సన్యాసినిగా దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకోవడానికి ముందు ఖుషీ షా మీడియాతో మాట్లాడారు. సాధారణ జీవితం గడపటం ద్వారానే ముక్తి, శాంతి లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఖుషీ షా జైన సాధువుగా మారడంపై ఆమె తండ్రి వినిత్ షా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఈయన.. ఖుషీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే ఖుషీని భవిష్యత్తులో డాక్టర్‌గా చూడాలని భావించినట్టు పేర్కొన్న బాలిక తల్లి.. తన కూతురి నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. గతంలో ఇదే కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు జైన సాధువులుగా దీక్ష తీసుకోవడం విశేషం.