ఇమ్రాన్ కు అందని ఆహ్వానం....అంతర్గత రాజకీయాలే కారణం: పాక్

SMTV Desk 2019-05-30 13:21:33  Pakistan foreign minister Shah Mehmood Qureshi , Organization of Islamic Cooperation, indian prime minister, Pakistan prime minister

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆహ్వానం పంపకపోవడంపై పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహ్మూద్ ఖురేషి స్పందించారు. ఇమ్రాన్‌ఖాన్‌ను ఆహ్వానించకపోవడం వెనుక భారత్‌లోని అంతర్గత రాజకీయాలే కారణమని అన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బిమ్స్‌టెక్ దేశాధినేతలను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. బిమ్స్‌టెక్‌లో సభ్య దేశం కానం దున పాక్‌కు ఆహ్వానం వెళ్లలేదు. దీని పై మంగళవారం ఖురేషి స్పందిస్తూ మోదీ ప్రమాణస్వీకారానికి హాజరుకావడం కన్నా సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి భారత్ చర్చలు జరిపితే బాగుంటుందన్నారు. గతేడాది జరిగిన పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ గెలుపొందినప్పుడు మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అదే సంప్రదాయాన్ని ఇమ్రాన్‌ఖాన్ కూడా పాటించారు అని ఖురేషి తెలిపారు.