నన్ను నిర్మాతగా నిలబెట్టిన దర్శకుడి కోసం.....

SMTV Desk 2019-05-30 13:15:06  v v vinayak

దిల్ రాజు. తన పేరు ముందు ‘దిల్’ అనే పేరును ఇచ్చిన దర్శకుడి రుణం తీర్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు...వి.వి.వినాయక్‌. ఎన్నో హిట్‌ చిత్రాలను అందించిన ఈ హిట్‌ దర్శకుడి సినిమా కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ జనాలకు ఇది కొంత ఆశ్చర్యకరమైన విషయమే. దర్శకుడిగా తడబడుతున్న ప్రస్తుత తరుణంలో వినాయక్‌ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడనే వార్త గుప్పుమంటోంది.

శరభ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన ఎన్‌.నరసింహారావు దర్శకత్వంలో వినాయక్‌ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడట. అసలు ట్విస్టేంటంటే ఈ చిత్రాన్ని కె. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో దిల్‌ రాజు నిర్మించబోతున్నాడనే వార్త సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తనను నిర్మాతగా నిలబెట్టిన వినాయక్‌ను నటుడిగా నిలబెట్టేందుకే దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడని సినీవర్గాలు అంటున్నాయి.