శ్రీదేవి, మలైకాలను పోల్చిన నెటిజెన్...అర్జున్ కపూర్ కౌంటర్ డైలాగ్

SMTV Desk 2019-05-30 13:14:25  arjun kapoor

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, నటి మలైకా అరోరాలు సంబంధం గురించి మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తుంటాయి. అయితే దీని గురించి వారు నేరుగా మీడియా మందు ఎప్పడూ మాట్లాడలేదు. తాజాగా అర్జున్ కపూర్ ఫ్యాన్ ఒకరు అటు తల్లి శ్రీదీవి, ఇటు మలైకా అరోరాలను పోలుస్తూ ఆయనను ఒక ప్రశ్న అడిగారు. దీనికి అర్జున్ కపూర్ దిమ్మతిరిగే సమాధానం చెప్పడంతో, ఆ ఫ్యాన్ చివరికి క్షమాపణలు కోరాల్సివచ్చింది.

వివరాల్లోకి వెళితే కుసుమ్ అనే అభిమాని అర్జున్ కపూర్‌ను ట్విట్టర్ ద్వారా ‘మీరు మీ తండ్రి రెండవ భార్య శ్రీదేవిని ద్వేషించారు. శ్రీదేవి వచ్చాక మీ అమ్మకు అన్యాయం జరిగిందని భావించారు. మరి మీరు అటువంటి మహిళతోనే డేట్‌కు వెళుతున్నారు. ఆమెకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు కదా! ఈ డబుల్ స్టాండర్డ్ ఏమిటీ అర్జున్? అని ప్రశ్నించారు. దీనికి అర్జున్ సమాధానమిస్తూ ‘నేను ఎవరినీ ద్వేషించ లేదు కుసుమ్! మా మధ్య దూరం ఏర్పడింది.

నిజంగా ద్వేషమనేదే ఉంటే శ్రేదేవి అంత్యక్రియల సమయంలో నేను నా తండ్రి, జాన్వీ, ఖుషీలతో పాటు ఉండేవాడిని కాదు. టైపింగ్‌తో ఏదేదో రాయడం, ఇతరులను జడ్జ్ చేయడం సులభమే. కానీ అంతకు ముందు ఆలోచించడం అవసరం’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె అర్జున్ కపూర్‌ను క్షమాపణలు కోరాల్సి వచ్చింది.