జగన్ నమ్మకాన్ని వమ్ము కానివ్వను.. ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా

SMTV Desk 2019-05-30 13:08:41  jagan

టీడీపీ అధినేత చంద్రబాబు దుబారా ఖర్చుల కారణంగానే ఏపీలో లోటు బడ్జెట్ ఏర్పడిందని నగరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆర్కే రోజా విమర్శించారు. తమ నేత జగన్ ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.

తాను ఐరన్ లెగ్ అని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు నగరిలో తన గెలుపు చెంపపెట్టని ఆమె వ్యాఖ్యానించారు. ‘జగన్ నమ్మకాన్ని వమ్ము కానివ్వను. ఏపీలో ఏ బాధ్యత అప్పగించినా చేపట్టేందుకు సిద్ధం. వైఎస్ జగన్ కు మంచి పేరు తీసుకొస్తా. రాష్ట్రంలో మహిళల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా’ అని రోజా తెలిపారు.