హీరో విజయ్ ఇంటికి పార్శిల్.. బెదిరింపు లేఖ!

SMTV Desk 2019-05-30 13:01:14  bjp

హీరో విజయ్ కుటుంబ సభ్యులకి తాజాగా ఒక చిత్రమైన అనుభవం ఎదురైంది. వాళ్ల ఇంటికి కాషాయ వస్త్రాల పార్శిల్ వచ్చింది. ఇలా జరగడానికి బీజేపీ పై విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ చేసిన విమర్శలే కారణం. ఎన్నికల సమయంలో ఎస్. ఎ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాజకీయ నాయకుల అండదండలు చూసుకునే పైరసీ దారులు రెచ్చిపోతున్నారని అన్నారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే, అంతా కాషాయ వస్త్రాలు కట్టుకుని తిరగవలసి వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బీజేపీ ఘన విజయాన్ని సాధించడంతో, తిరుపూర్ బీజేపీ యువజన విభాగం పేరుతో విజయ్ ఇంటికి ఒక పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ లో ఓ కాషాయ వస్త్రంతో పాటు ఒక లేఖ వుంది. మొదటిసారిగా కాషాయ వస్త్రం పంపుతున్నామనీ .. ఇక వరుసగా కాషాయ వస్త్రాలు పంపుతూనే ఉంటాము అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై విజయ్ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.