గెలుపు దిశగా సైకిల్ పరుగులు..

SMTV Desk 2017-08-28 11:12:04  nandhyala elections, winning lead tdp, counting

నంద్యాల, ఆగస్ట్ 28 : నంద్యాల ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు రౌండ్లను పూర్తి చేసుకున్న ఈ ఎన్నికల కౌంటింగ్ ఆరో రౌండ్ కి వచ్చే సరికి టీడీపీ ఆధిక్యంలోకి దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ.. గెలుపు దిశగా పరుగులు పెడుతుంది. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ 3303 ఓట్ల ఆధిక్యతను సాధించింది. తొలి రౌండ్ లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉన్న భూమా రెండో రౌండ్ ముగిసేసరికి 2,832 ఓట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్ లో 3113, నాలుగవ రౌండ్ లో 3600, ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి 13,143 ఓట్లతో ముందంజలో ఉన్నారు.