అద్భుతం: 3డీ స్నానపు గదిని చూశారా....?

SMTV Desk 2019-05-30 12:46:16  3d

ఈ ఫొటోలో కనిపిస్తున్నది 3డీ ముద్రిత స్నానపు గది. సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల బృందం దీన్ని ఒకే రోజులో సిద్ధం చేసింది. సాధారణ స్నానపు గదుల కంటే ఇది పర్యావరణహితంగా ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి సంస్థలు ఈ టెక్నాలజీతో చౌకగా, వేగంగా, నాణ్యంగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ బాత్‌రూం యూనిట్స్‌(పీబీయూ)ను నిర్మించొచ్చని అన్నారు.

3డీ ముద్రిత స్నానపు గది గోడల నిర్మాణానికి వాడిన కాంక్రీటు, సంప్రదాయ కాంక్రీటు కంటే మన్నికైందన్నారు. ఇటుక, ఇసుక, సిమెంటుతో గోడల నిర్మాణానికి పట్టే దానిలో సగం సమయంలోనే పని పూర్తవుతుందన్నారు. స్నానపు గది లోపల అద్దం, టాయులెట్‌ బౌల్‌, సింక్‌, సిరామిక్‌ టైల్‌ వాల్స్‌, ఫ్లోరింగ్‌ పనులకు 5రోజులు పడుతుందని చెప్పారు.