గాయం కారణంగా తొలి మ్యాచ్ కు స్టెయిన్‌ దూరం !

SMTV Desk 2019-05-30 12:24:11  dale steyn

లండన్‌: ప్రపంచకప్‌ మెగా టోర్నీలో దక్షిణాఫ్రిక జట్టుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ గాయం కారణంగా గురువారం ఇంగ్లాండ్‌తో టోర్నీ ఆరంభ మ్యాచ్‌కు దూరమయ్యాడు. భుజం గాయంతో బాధపడుతున్న స్టెయిన్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు. స్టెయిన్‌ బాగా మెరుగయ్యాడు. ఆదివారం (బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌) నాటికి కాకపోయినా.. భారత్‌తో మ్యాచ్‌ (జూన్‌ 5) కైనా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు అని దక్షిణాఫ్రికా కోచ్‌ గిబ్సన్‌ చెప్పాడు.