జర్మనీని హెచ్చరించిన ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌

SMTV Desk 2019-05-30 12:23:14  German Chancellor Angela Merkel

బెర్లిన్‌: జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ తాజాగా జర్మనీని హెచ్చరించింది. ఐరోపా వ్యాప్తంగా జాతీయవాద ఉద్యమాలు క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించింది. జర్మనీకి వున్న నాజీ చారిత్రక నేపథ్యంలో పెరుగుతున్న జాతీయవాద ఉద్యమాల పట్ల మరింత అప్రమత్తత అవసరమన్నారు. గత వారం జరిగిన ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఐరోపా మొత్తం జాతీయవాద పార్టీల ఆధిక్యత వెల్లువెత్తిన నేపథ్యంలో మెర్కెల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను జర్మనీ చారిత్రక నేపథ్యంలో చూడాలని, అంటే మనం అందరికన్నా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు.