కడుపులో చనిపోయిన పిండాన్ని కంటికిరెప్పలా చూసుకున్న తల్లి

SMTV Desk 2019-05-30 12:22:33  women

అమెరికాలో మనసు కదలించే సంఘటన చోటుచేసుకుంది. సృష్టిలో తల్లిప్రేమకు సాటివచ్చే అనుబంధం మరోటి లేదు. అమెరికాలో ఓ తల్లి అమ్మతానానికి నిలువెత్తు రూపంలా మారింది. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినా కూడా ఆ పిండాన్ని ఒదలకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. అమెరికాలోని మిస్సోరికి చెందిన షారాన్ సుదర్లాండ్‌ 14 వారాల గర్భంలో ఉన్నప్పుడు వైద్యులు షాకింగ్ వార్త చెప్పారు. ఆమె కడుపులోని బిడ్డ గుండె పనిచేయక చనిపోయిందని వెల్లడించారు. అబార్షన్ చేసి, పిండాన్ని తీసేస్తామని, పిండం ముక్కలు అవుతుందని చెప్పారు. షారాన్ మరింత కుదలైంది. తన బిడ్డను ముక్కలు చేయకుండా చేతికి అందించాలని కోరింది. ‘అది మెడికల్ వేస్ట్.. దాంతో ఏం చేసుకుంటావు?’ అని వైద్యులు విసుక్కున్నారు. అయినా ఆమె పట్టువదల్లేదు. తన బిడ్డను తనకు అప్పగించాలని కోరింది. వైద్యులు ఆమె కోరిక మేరకు గర్భస్థ పిండాన్ని జాగ్రత్తగా తీసి చేతుల్లో పెట్టారు.షారాన్ దాన్ని ఇంటికి తీసుకెళ్లి, సెలైన్ సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టెంది. 14 వారాలకే పిండానికి అన్ని అవయవాలూ ఏర్పడ్డాయి. షారాన్ ఆ బిడ్డను చూసుకుంటూ మురిసేది. కన్నీళ్ల మధ్యే ప్రేమతో పొంగిపోయేది. వారం పాటు బిడ్డను అలా చూసుకున్న తర్వాత బయటికి తీసింది. తన బిడ్డ ఎప్పుడూ తమతోనే ఉండేందుకు ఆ పిండాన్ని పూలకుండీలో పూడ్చిపెట్టింది. ‘నా బిడ్డను మెడికల్ వేస్ట్ అని డాక్టర్లు చెప్పినప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. అతడు చనిపోతే మాత్రం నా బిడ్డ కాకుండా పోతాడా? ఇప్పుడు మొక్క రూపంలో పెరుగుతూ మా చెంతే ఉంటాడు.. ’ అని అంటోంది షారాన్.