MB26: మ‌హేష్ బాబుకి హీరోయిన్ దొరికేసింది!!

SMTV Desk 2019-05-30 12:13:12  devadas

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 26వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా వార్త‌లే విన‌ప‌డ్డాయి. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ జ‌త‌గా క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఛ‌లో , గీత గోవిందం , దేవదాస్ చిత్రాల్లో మాత్ర‌మే న‌టించిన ర‌ష్మిక‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కార‌ణంగా మ‌హేష్ సినిమాలో ఈమెను హీరోయిన్‌గా తీసుకున్నారు. ద‌ర్శ‌క నిర్మాత‌లు. కేవ‌లం మూడు సినిమాల‌తోనే (నాలుగో సినిమా `డియ‌ర్ కామ్రేడ్‌` విడుద‌ల కావాల్సి ఉంది) సూప‌ర్‌స్టార్‌ మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్న ర‌ష్మిక మంద‌న్న స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

సిల్వ‌ర్ జూబ్లీ చిత్రం `మ‌హ‌ర్షి` త‌ర్వాత మ‌హేష్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే ఈ సినిమా సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. దిల్‌రాజు, అనీల్ సుంకర నిర్మాతలు. జూన్ చివరి వారంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.