బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా అప్ డేట్

SMTV Desk 2019-05-29 15:26:27  bala krishna

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడనీ, ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ కథను పక్కన పెట్టేశారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

ఒక ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలు .. ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన కథను కేఎస్ రవికుమార్ సిద్ధం చేశాడట. కథలో ఒక తరం విలన్ గా తాత .. మరో తరం విలన్ గా మనవడు కనిపిస్తారట. ఈ పాత్రలు కొందరిని గుర్తుకు తెచ్చేలా ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కథను టచ్ చేయకపోవడం మంచిదని పక్కన పెట్టేశారట. మరో కొత్త కథ సిద్ధమయ్యేదాకా బాలకృష్ణ వేచి చూస్తాడో .. బోయపాటితో ముందుకెళతాడో చూడాలి.