మీరు లేకుంటే నేను నా టీమ్ కూడా తప్పుకుంటాం: రాహుల్ కు సచిన్

SMTV Desk 2019-05-29 15:18:02  sachin

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా? లేదా? అన్న విషయంలో అనిశ్చితి నెలకొన్న వేళ, పార్టీ శ్రేణుల నుంచి రాహుల్ రాజీనామాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాంగ్రెస్ పార్టీని రాహుల్ మాత్రమే నడిపించగలరన్న ఒత్తిడిని పెంచుతూ, రాజస్థాన్ యువనేత సచిన్ పైలట్ ఓ అల్టిమేట్టం జారీ చేసినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ తప్పుకుంటే, తాను తన అనుచరులైన ఎమ్మెల్యేలతో సహా రిజైన్ చేస్తామని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

రాజస్థాన్ లో గత సంవత్సరం జరిగిన ఎమ్మికల్లో 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్, ప్రస్తుతం అధికార పీఠాన్ని అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 200 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో బీజేపీకి 73 మంది ఎమ్మెల్యేలున్నారు. తొలుత సచిన్ పైలట్ నే సీఎం పదవి వరిస్తుందని వార్తలు రాగా, ఆపై సీనియర్ నేత అయిన కారణంగా అశోక్ గెహ్లాట్ పై కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది. తాజాగా సచిన్ పైలట్ హెచ్చరికలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.