మరోసారి ఆగిన ముద్రగడ పాదయాత్ర

SMTV Desk 2017-08-27 18:50:32  Mudragada padmanabham, kapu reservation, Ap CM, paadayaatra, Chalo Amaravati

కిర్లంపూడి, ఆగస్ట్ 27: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఛలో అమరావతి పాదయాత్రను స్థానిక వీరవరం గ్రామం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు స్పందిస్తూ... ముద్రగడ పాదయాత్రను స్థానిక పోలీసులు అడ్డుకోలేకపోయారని, దీంతో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముద్రగడ చేసిన ప్రతి ఉద్యమంలో హింస నెలకొందని, కిర్లంపూడిలో ఏం జరిగినా ముద్రగడే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. ముద్రగడ నిబంధనలు ఉల్లంఘించారు, ఆయనపై కేసు నమోదు చేస్తామని డీజీపీ హెచ్చరించారు.