పాక్ గూఢచారులు అరెస్ట్

SMTV Desk 2019-05-29 15:14:02  Pakistan, Pakistani spy agents arrest in india

ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుల్లో సంచరిస్తున్న ఇద్దరు పాకిస్తాన్ వ్యక్తులను భారత ఆర్మీ అరెస్ట్ చేసింది. సరిహద్దుల్లోని ఆర్మీ పోస్టు, పరిసర ప్రాంతాల్లో వీరు వీడియో తీస్తుండగా అరెస్టు చేశారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. అరెస్టు అయిన వీరిలో ఒకరు కథువా, మరొకరు డొడా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లలో ఉన్న వీడియోలను ఆర్మీ అధికారులు పరిశీలించారు. భారత్ కు చెందిన పలు రహస్యాలను వీరు పాక్ లోని కొందరికి పంపినట్టు ఆర్మీ అధికారులు గుర్తించారు. పాక్ అధికారులతో వీరు తరచూ మాట్లాడుతున్నట్టు ఆర్మీ విచారణలో తేలింది. వీరిని సమగ్రంగా విచారిస్తున్నామని ఆర్మీ అధికారులు వెల్లడించారు.