బౌలర్లే గేమ్ చేంజర్లు: మలింగా

SMTV Desk 2019-05-29 15:04:56  malinga

ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా వివిధ జట్ల ఆటగాళ్ళు ఈ మెగా టోర్నీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక సీనియర్ పేసర్ బౌలర్ మలింగా కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ...క్రికెట్‌ అంటే బ్యాట్స్‌మెన్‌ ఆటే. కానీ బౌలర్లు ఆ ఆటను మార్చగలరు. వికెట్లు తీసి మ్యాచ్‌ను గెలిపించగలరు. అయితే బౌలర్లకు నైపుణ్యం కావాలి. ఆటను విశ్లేషించుకోగలగాలి. ప్రపంచకప్‌లో బౌలర్ల పాత్ర చాలా కీలకం అని చెప్పుకొచ్చారు.