కివీస్ ఫై విండీస్ ఘన విజయం

SMTV Desk 2019-05-29 15:04:10  new zealand vs west indies

మంగళవారం న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో విండీస్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన విండీస్‌ 49.2 ఓవర్లలో 421 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మన్‌ చెలరేగి ఆడారు. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎవిన్‌ లూయీస్‌ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్‌)లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అనంతరం షై హోప్‌ (86 బంతుల్లో 101; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఇక ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ హోల్టర్‌ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. కివీస్ బౌలర్ బౌల్ట్‌ నాలుగు వికెట్లు దక్కాయి.ఛేదనలో కివీస్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గుప్తిల్ (5), నికోలస్ (15) నిరాశపరిచారు. రాస్ టేలర్ (2) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో వికెట్‌ కీపర్‌ బ్లండెల్‌ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ, కెప్టెన్‌ విలియమ్సన్‌ (64 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం మరెవరూ క్రీజులో నిలవకపోవడంతో న్యూజిలాండ్‌ 47.2 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్ వైట్ మూడు వికెట్లు తీసాడు.