ఫ్రెంచ్‌ ఓపెన్‌: ముందంజలో ఒసాకా, హలెప్‌లు

SMTV Desk 2019-05-29 15:03:30  Naomi Osaka, Simona Halep

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌సీడ్‌ క్రీడాకారిణిలు ఒసాకా, హలెప్ లు రెండో రౌండ్ లో అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ ఒసాకా, హలెప్‌లు రెండో రౌండ్‌ చేరుకున్నారు. ఒసాకా 0-6, 7-6 (4-7), 6-2తో షిమెద్లెవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది. మూడో సీడ్‌ హలెప్‌ 6-2, 3-6, 6-1తో టామ్‌జోనోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందింది. అజరెంక (బెలారస్‌) 6-4, 7-6 (7-4)తో వొస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. బౌచర్డ్‌ (కెనడా) 2-6, 2-6తో తుర్సెంకో (ఉక్రెయిన్‌) చేతిలో ఓడి ఇంటిదారి పట్టిందపురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో జ్వెరెవ్‌ 7-6 (7-4), 6-3, 2-6, 6-7 (5-7), 6-3తో జాన్‌ మిల్‌మన్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. 4 గంటలకు పైగా ఈ మ్యాచ్ జరిగింది. మొదటి రెండు సెట్లు గెలిచిన జ్వెరెవ్‌.. ఆ తర్వాత రెండు సెట్లు ఓడిపోయాడు. అయితే నిర్ణయాత్మక ఐదో సెట్లో పుంజుకున్న జ్వెరెవ్‌.. సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు.ఇతర మ్యాచ్‌లలో డెల్‌పొట్రో (అర్జెంటీనా) 3-6, 6-2, 6-1, 6-4తో జారే (చిలీ)పై విజయం సాధించగా.. కచానోవ్‌ (రష్యా), వెర్దాస్కో (స్పెయిన్‌)లు రెండో రౌండ్‌ చేరారు. ఇక పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న జోడి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో బోపన్న-కొపిల్‌ (రొమేనియా) 6-3, 7-6 (7-4)తో క్లాసన్‌ (దక్షిణాఫ్రికా)-వీనస్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.