రాజారెడ్డి, జగన్ లేకుండా వైఎస్ లేరు... 'యాత్ర 2' తీస్తున్నానన్న దర్శకుడు

SMTV Desk 2019-05-29 14:43:32  yatra

ఇటీవల మమ్ముట్టి హీరోగా వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ యాత్ర ను తీసి విజయం సాధించిన దర్శకుడు మహీ వీ రాఘవ, ఇప్పుడు యాత్ర-2 తీసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వైఎస్ఆర్ కథ రాజారెడ్డి, జగన్ లేకుండా అసంపూర్తేనని వ్యాఖ్యానించిన ఆయన, యాత్ర-2 కథలో వీరిద్దరివే ప్రముఖ పాత్రలని చెప్పారు.

యాత్ర సినిమాను వైఎస్ జగన్ ను చూపిస్తూ ముగించడానికి కారణం కూడా ఇదేనని, ఆ చిత్రంలో తామెక్కడ సినిమాను ముగించామో, అక్కడి నుంచి కొత్త సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు. వైఎస్ స్ఫూర్తితో జగన్ వేసిన అడుగులతో ఈ చిత్రం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.