ఎడ్యుకేషన్ లోన్స్‌లల్లో మహిళలదే పైచేయి!

SMTV Desk 2019-05-29 14:41:14  education loans, womens are interested on education loans, just money survey,

దేశీ ఈఎంఐ ఫైనాన్సింగ్ కంపెనీ జెస్ట్‌‌మనీ మహిళలపై చేసిన ఓ సర్వే పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మహిళలు ఎక్కువగా మేకప్, నగలు, చీరలు వంటి వాటిపై అనేక ఖర్చు చేస్తుంటారని అనేక మంది అనుకుంటారు. కాని వారు కేవలం వీటిపై కాకుండా ఎడ్యుకేషన్ లోన్స్‌పై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇది మగవారి కన్నా ఎక్కువగా కావడం గమనార్హం. అంతేకాదు అధికంగా రుణ మొత్తాన్ని తీసుకుంటారు. అలాగే ఎక్కువ ఈఎంఐ మొత్తాన్ని ఎంచుకుంటున్నారు. జెస్ట్‌మనీ సర్వే ప్రకారం.. మహిళలు తీసుకునే రుణాల్లో 20 శాతం ఎడ్యుకేషన్‌కు సంబంధించినవే ఉన్నాయి. పురుషులు తీసుకునే రుణాల్లో కేవలం 6 శాతం మాత్రమే ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఉన్నాయి. అలాగే మహిళలు తీసుకునే రుణ మొత్తం మగవారితో పోలిస్తే 35 శాతం అధికంగా ఉంది. ఇటీవల కాలంలో ఈఎంఐ ఫైనాన్సింగ్‌‌లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. కస్టమర్లు షాపింగ్, ట్రావెల్, ఎడ్యుకేషన్ వంటి వాటి కోసం ఎక్కువగా ఈఎంఐ మార్గాలను ఎంచుకుంటున్నారు. భారతీయులు ఈఎంఐ ఫైనాన్షింగ్ ప్రయోజనాలను ఎక్కువగా పొందుతున్నారు.