ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.... కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాజీనామా?

SMTV Desk 2019-05-29 14:25:00  pcc

పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారా? అవునన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు కాదు పోలింగ్‌ ముగిసిన వెంటనే గత నెల 11వ తేదీనే ఆయన తన లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పంపినట్లు సమాచారం. ఎన్నికల్లో పార్టీకి రాష్ట్రంలో అంత సానుకూల పరిస్థితి లేనందున తన వైఫల్యాన్ని అంగీకరిస్తూ రాజీనామా లేఖను అందించినట్లు తెలుస్తోంది.

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా దక్చించుకోలేదు సరికదా మెజార్టీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. జాతీయ పార్టీగా కనీసం రెండు మూడు స్థానాల్లో కూడా ఎక్కడా నిలవక పోవడం ఆ పార్టీ దైన్యస్థితికి అద్దం పడుతోంది. ఈ పరిస్థితిని ముందుగా గుర్తించినందునే రఘువీరారెడ్డి రాజీనామా చేశారని, దీనిపై రాహుల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం.