మలింగా క్రీడాస్పూర్తి....ఐసిసి సైతం ఫిదా

SMTV Desk 2019-05-29 14:23:42  malinga, srilanka, Australia, Stoinis

శ్రీలంక: శ్రీలంక సీనియర్‌ పేసర్‌ లసిత్‌ మలింగ తనలోని క్రీడాస్పూర్తిని ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియా,శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌.. మలింగ దగ్గరకు వచ్చి స్లో బంతులు ఎలా విసరాలో అని అడిగాడు. ప్రత్యర్థి ఆటగాడు అని చూడకూండా మలింగ కొన్ని సూచనలు చేశాడు. అంతేకాదు స్వయంగా కొన్ని బంతులు వేసి చూపించాడు. దీంతో మలింగపై అందరూ ప్రశంశల వర్షం కురిపించారు. మలింగ క్రీడాస్ఫూర్తిని మెచ్చుకొంటూ ఐసీసీ కూడా ఓ ట్వీట్‌ చేసింది. పరాజయం అనంతరం కూడా స్టాయినిస్‌కు మలింగ స్లో బంతుల రహస్యం చెప్పాడు. క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అని ఐసీసీ ట్వీట్‌ చేసింది.మ్యాచ్ అనంతరం ఈ విషయంపై మలింగ మాట్లాడుతూ... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వైవిధ్యం చాలా ముఖ్యం. నా సాయం కోరిన ప్రతి ఒక్కరికీ సూచనలు, రహస్యాలూ చెపుతాను. ఎలాంటి పరిస్థితుల్లో స్లో బంతులు వేయాలి, అప్పుడు బంతిని ఎలా పట్టుకోవాలని స్టాయినిస్‌కు చెప్పాను. అతనికి సలహాలు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రపంచకప్‌లో స్టాయినిస్‌ స్లో బంతులు వేస్తాడని అనుకుంటున్నా అని మలింగ పేర్కొన్నాడు.