పెళ్ళికి ముందు ఒకలా...పెళ్లైయ్యాక మరోలా!

SMTV Desk 2019-05-29 14:19:57  virat kohli, anushka sharma

టీంఇండియా కాప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మపై పాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ఆరంభంలో దూకుడుగా ఉన్న విరాట్ కోహ్లీ.. మైదానంలో ప్రత్యర్థుల కవ్వింపులకి అదేరీతిలో బదులిచ్చేవాడు. కానీ.. 2007, డిసెంబరు 11న అనుష్క శర్మతో వివాహమైన తర్వాత అతడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ప్రత్యర్థులు తనపై స్లెడ్జింగ్‌కి దిగినా.. కోహ్లీ మాత్రం బ్యాట్‌తో సమాధానం చెప్తూ పరిణతితో వ్యవహరిస్తున్నాడు. ఈ మార్పునకి కారణం అనుష్క శర్మేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ వెల్లడించాడు. పెళ్లికి ముందు ఆ తర్వాత టీమిండియాని ఓ కెప్టెన్‌గా ఎలా నడిపిస్తున్నారు..? అని కోహ్లీని ప్రశ్నించగా.. ‘అనుష్క శర్మతో పెళ్లి తర్వాత నా బాధ్యత మరింత పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే.. ఆ బాధ్యత నా కెప్టెన్సీలో కూడా మార్పు తెచ్చింది. కెప్టెన్‌గానే కాదు.. ఒక ఆటగాడిగా, మనిషిగా నాలో పరిణతి వచ్చింది’ అని సమాధానమిచ్చాడు.