వైద్య చరిత్రలో అరుదైన ఘటన: డియోడ్రెంటు స్ప్రేతో కోమా నుండి బయటికి

SMTV Desk 2019-05-29 12:20:52  boy woke up in coma while he smelled the deodorant spray, england

ఇంగ్లాండ్: ఇంగ్లాండ్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. 21 రోజుల పాటు కోమాలో ఉన్న ఓ బాలుడు ఎటువంటి మందులకు, స్పందించని అతని శరీరం అతను వాడే డియోడ్రెంటు స్ప్రే కొట్టేసరికి టక్కున లేచాడు. ఈ విచిత్ర ఘటన ఇంగ్లండ్‌లోని కుంబ్రియా ప్రాంతంలో జరిగింది. కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు కొన్ని రోజుల క్రితం చలికి గడ్డకట్టి ఉన్న నది వద్దకు వెళ్లాడు. ఆ నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతన్ని బయటకు తీశారు. అప్పటికే అతను చనిపోయాడని అందరూ అనుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తీస్కెళ్లారు. వైద్యులు అతని గుండె కొట్టుకోవడం పసిగట్టి అతను బతికే వున్నాడని, కోమాలోకి వెళ్లాడని నిర్ధారించారు. సుమారు 21 రోజులపాటు క్రూజ్‌ని కోమాలో నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో క్రూజ్ ఇంట్లో స్నానానికి ఉపయోగించే సోప్స్‌తోపాటు డియోడ్రెంట్ ఇతరాత్రా ఇష్టమైన వస్తువులను తీసుకురావాలని క్రూజ్‌ తల్లికి ఓ నర్సు సూచించింది. ఆమె సూచనల మేరకు క్రూజ్ శరీరాన్ని శుభ్రం చేసిన తల్లి అతడికి ఇష్టమైన వస్తువులన్నింటినీ తెచ్చి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరగా డియోడ్రెంట్‌ను స్ప్రే చేసింది. దీంతో క్రూజ్ వెంటనే కోమా నుంచి బయటకు వచ్చాడు. ఆ డియోడ్రెంట్ అంటే క్రూజ్‌కు చాలా ఇష్టమట. అది తన బిడ్డలో కదలిక తీసుకువస్తుందని తాము అస్సలు ఊహించలేకపోయామని క్రూజ్‌ తల్లి హర్షం వ్యక్తం చేసింది. వైద్య చరిత్రలో ఇది చాలా అరుదైన ఘటన అని వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.