మోడి సర్కార్ తో పని చేసేందుకు సిద్దం: అమెరికా

SMTV Desk 2019-05-29 12:19:38  narendra modi, donald trump, india, america

వాషింగ్టన్‌: లోక్ సభ ఎన్నికల్లో రెండో సారి ఘన విజయం సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా పలు దేశాధినేతలు మోడికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే తాజాగా మోడి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందంటూ ట్రంప్‌ కార్యాలయ అధికారి ప్రకటించారు. అమెరికాకు భారత్‌ అత్యంత సన్నిహితదేశం అని పేర్కొన్నారు. అనేక అంశాలపై భారత్‌తో చర్చించడానికి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మైక్‌ పాంపియో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా అధికార ప్రతినిధి మోర్గన్‌ ఓర్టగస్‌ పలు అంశాలను వెల్లడించారు. అలాగే భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.