మోదీ ప్రమాణస్వీకారం: పాక్ ప్రధానికి అందని ఆహ్వానం

SMTV Desk 2019-05-29 12:18:44  Pakistan prime minister, imran khan, Indian prime minister, narendra mdoi

మే 30న జరిగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ‘బిమ్‌స్టెక్’ దేశాధినేతలకు పిలిపునిచ్చారు. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మాత్రం ఆహ్వానం పంపలేదు. బిమ్‌స్టెక్ కూటమిలో బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలు కలిసి ‘బంగాళాఖాత బహుళరంగ సాంకేతిక, ఆర్థిక సహకార ప్రారంభం’గా ఈ దేశాలను పిలుచుకుంటారు. అయితే మోడీ ప్రమాణస్వీకారానికి దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మాత్రం ఆహ్వానం వెళ్లలేదు.పాక్‌తో భారత సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అనే దానికి ఇది ఓ సంకేతమని పలువురు అంటున్నారు. 2014లో తొలిసారి ప్రధాని పదవి చేపట్టినప్పుడు మోదీ సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇప్పుడు పాక్‌పై భారత వైఖరిలో చాలా మార్పు వచ్చింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆపేంతవరకూ ఆ దేశంతో చర్చల ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పింది. అయితే మోడీ ఆహ్వానం అందకపోవడంపై పాక్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఆ అంశం అంత ప్రాధాన్యమైంది కాదని వ్యాఖ్యానించింది. అంతర్గత రాజకీయాల కారణంగానే తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆహ్వానించలేదని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ అన్నారు. బిమ్స్‌టెక్ దేశాలను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ గ్రూపులో పాకిస్థాన్ సభ్య దేశం కాదు.