తెరాస ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు ...

SMTV Desk 2019-05-29 12:05:54  BJP, TRS,

మంగళవారంనాడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ అద్యక్ష్యుడు మాట్లాడుతూ… తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా నిరూపించుకుంది. తెలంగాణాలో రోజురోజుకి బీజేపీ పార్టీ చాలా బలంగా తయారవుతుంది. రానున్న కాలంలో తెలంగాణాలో ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే కనిపిస్తుందని, మిగతా పార్టీలన్నీ కూడా కనుమరుగైపోతాయని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థతి దిగజారిపోతోందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ ఏర్పడితే బీజేపీ బలపడుతుందని జోస్యం చెప్పారని, అది ఇప్పుడు జరుగుతోందని బీజేపీ బలపడకుండా ఆపడం ఎవరి తరం కాదని అన్నారు.

కాగా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వారే కాపాడుకోలేకపోతున్నారు. వారి పాలన, సిద్ధాంతాలు నచ్చకనే వేరే పార్టీలోకి వలస వెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా సార్వత్రిక బీజేపీ గెలిచిన స్థానాల్లో చాలా అత్యధిక మెజారిటీతో జయభేరి మోగించిందని, దానితో పాటే ముఖ్యమంత్రి కుమార్తె కవితను కూడా ఓడించగలిగామని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ కుటుంబ పాలన నుంచి బయటపడేందుకు చాలామంది తెరాస ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, కేవలం మోడీ గారి మీద అభిమానం వల్లే తెలంగాణాలో విజయం సాధించామని లక్ష్మణ్ అన్నారు. రానున్నరోజుల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీజేపీ ని ఆపడం ఎవ్వరి వాళ్ళ కాదని అన్నారు.