జట్టుకి తొలి సెంచరీ నమోదు చేసిన రాహుల్

SMTV Desk 2019-05-29 11:47:22  kl rahul, mahendra singh dhoni

కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత ఇన్నింగ్స్ కి వచ్చిన టీంఇండియా మొదట్లో కొంచెం తడబడింది. అర్ధశతకానికి చేరువలో ఉన్న కెప్టెన్‌ కోహ్లీ (47; 46 బంతుల్లో 5x4)ని సైఫుద్దీన్‌ చక్కటి యార్కర్‌తో బౌల్డ్‌చేశాడు. అంతకు ముందు ధావన్‌(1), రోహిత్‌శర్మ(19 ) విజయ శంకర్ (2) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో టీమిండియా 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేయవలసి వచ్చింది. ఇక క్రీజులోకి వచ్చిన ధోని, లోకేష్ రాహుల్ ఇద్దరూ చెలరేగిపోయారు. రాహుల్ 99 బంతులకు 106 పరుగులు చేసి జట్టులో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇక ధోని కూడా 135.71 స్ట్రైక్ రేట్ తో సెంచరీ దిశగా వెళుతున్నాడు .. ప్రస్తుతం సెంచరీ కోసం ఒక్క పరుగు దూరం లో ధోని ఉన్నాడు ..