భారీ రేటుకు "ఆనందో బ్రహ్మ" శాటిలైట్ హక్కులు

SMTV Desk 2017-08-27 16:31:55  harror movie, tapsee, satilite rigts, 3 crores budjet movie.

హైదరాబాద్, ఆగస్ట్ 27 : హర్రర్ చిత్రం అనగానే ఒకప్పుడు భయం అనే కాన్సెప్ట్ ఉండేది. కాని ఇప్పుడు హర్రర్ సినిమా అనగానే అటు భయంతో పాటు కామెడీని కూడా జోడించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. అలాంటి కథతో తెరకెక్కించిన చిత్రాలన్నీ దాదాపు సక్సెస్ బాట పడుతున్నాయి. ఇప్పుడదే కోవలో "ఆనందో బ్రహ్మ" చేరిపోయింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద ఘన విజయం సాధించిన చిత్రాలలో ఈ చిత్రం కూడా చేరిపోయింది. తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "ఆనందో బ్రహ్మ" చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది. ఈ సినిమాను కేవలం 3 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. కాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు యాజమాన్యం 3. 25 కోట్లకి కొనుగోలు చేసినట్టు సమాచారం. పెట్టిన పెట్టుబడి కంటే శాటిలైట్ రూపంలో బడ్జెట్ తిరిగి వచ్చేయడం విశేషం. ఇప్పటికే నిర్మాతలకు 5 కోట్ల వరకూ లాభాలు వచ్చేశాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ చిత్రం దూసుకుపోతోంది.