పాండ్యా గేమ్ చేంజర్: రైనా

SMTV Desk 2019-05-29 11:30:16  hardik pandya, suresh raina

భారత క్రికెట్ ఆటగాడు సురేష్ రైనా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. రైనా మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా.. హార్దిక్ బ్యాటింగ్ చేయగలడు. అలానే.. కనీసం 6-7 ఓవర్లు బౌలింగ్‌ కూడా చేయగలడు. అయితే.. ప్రపంచకప్‌లో అతనికి టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి సహకారం లభించాలి. అప్పుడే హార్దిక్ ఐపీఎల్ తరహాలో అత్యుత్తమంగా ఆడగలడు. ఒకవేళ వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకి ‘‘మ్యాన్ ఆఫ్ టోర్నీమెంట్‌’’ అవార్డు లభించినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే.. అతను భారత్ తరఫున మ్యాచ్‌ల్ని మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాడు’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.