ఒక్క వీడియోతో కుప్పకూలిన ఆస్ట్రియా ప్రభుత్వం

SMTV Desk 2019-05-29 11:28:21  austria government fell down while one leaked video is viral

ఆస్ట్రియాలో తాజాగా లీకైన ఓ వీడియో వల్ల ప్రభుత్వం కుప్పకూలింది. ఆస్ట్రియా చాన్స్‌లర్ సెబాస్టియన్ ఖర్జ్‌ పదవి కోల్పోయారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఖర్జ్ తగిన మద్దతు పొందలేకపోయారు.ఈ అవిశ్వాస తీర్మానానికి ఫ్రీడం పార్టీ, ప్రతిపక్ష పార్టీ సోషల్ డెమాక్రట్స్ మద్దతు ఇచ్చారు.ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెలన్, ప్రస్తుత వైస్ చాన్సలర్ హర్ట్‌వింగ్ లాంగర్‌ను తాత్కాలిక నేతగా నియమించారు. అసలు ఏమైంది అంటే...నిజానికి ఈ వివాదం జర్మన్ మీడియా ఒక వీడియో పబ్లిష్ చేయడంతో మొదలైంది.జర్మన్ మీడియా ప్రసారం చేసిన ఈ వీడియో ఫుటేజిలో ఫ్రీడం పార్టీ నేత, జర్మనీ ప్రస్తుత ప్రభుత్వంలో వైస్ చాన్సలర్‌గా ఉన్న హెనిజ్ క్రిస్టియన్ స్టార్క్‌, తమ పార్టీకే చెందిన కీలక నేత జొహన్నా గుడ్‌నెస్‌తో మాట్లాడుతుండడం కనిపిస్తోంది.ఈ వీడియోలో ఇద్దరు నేతలు ఒక రష్యా మహిళతో కూచుని డ్రింక్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ మహిళ ఒక రష్యా వ్యాపారి మేనకోడలు అని చెబుతున్నారు.ఈ వీడియోలో స్టార్క్, ఆ మహిళతో ఆస్ట్రియా వార్తా పత్రిక క్రోనెన్ జుటుంగ్‌ లో ఒక పెద్ద వాటాను కొనుగోలు చేసి, ఫ్రీడం పార్టీకి సాయం చేయాలని కోరుతున్నారు. బదులుగా తాము ఆమెకు సాయం చేస్తామని అంటున్నారు.ఈ వీడియోను ఎవరు షూట్ చేశారనే విషయం తెలీడం లేదు. కానీ ఇది వెలుగుచూసిన కొన్ని గంటల తర్వాత స్టార్క్‌ను తొలగించాలని ఖర్జ్ నిర్ణయించారు. దాంతో స్టార్క్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఆ తర్వాత ఫ్రీడం పార్టీలోని ఇతర మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.EPA వీడియో బయటపడగానే క్రిస్టియన్ స్టార్క్ రాజీనామా చేశారు. ఆ తరువాత ఆస్ట్రియా పీపుల్స్ పార్టీ చీఫ్ సెబాస్టియన్ ఖర్జ్ ఆ దేశంలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన మొట్ట మొదటి చాన్సలర్‌గా నిలిచారు.పార్లమెంటులో విపక్షాలు కుర్జ్‌కు వ్యతిరేకంగా, అతడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టాయి. ఆ రెండింటిలో విజయం సాధించింది.అయితే యూరోపియన్‌ యూనియన్‌కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఖర్జ్‌కు సుమారు 35 శాతం ఓట్లు లభించాయి. ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి ఆయనకు ఆ మద్దతు కూడా పనికిరాకుండాపోయింది.